పుట్టు పేరు: చక్రవర్తుల కిరణ్
పెట్టు పేరు (కలం పేరు): నచకి (“నల్లాన్ చక్రవర్తుల కిరణ్”)
పుట్టిన తేదీ: 13 నవంబరు, 1977
స్వస్థలం: హైదరాబాదు*, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం (* – పెఱిగినది రాయలసీమలోనైనా బహుకాలనివాసం రాజధానిలోనే)
విద్యార్హతలు: బి.టెక్. (ఎలెక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్), ఎం.ఎస్. (బయోమెడికల్ ఇంజనీరింగ్), ఎం.ఎస్. (మైక్రోసిస్టమ్స్ ఇంజనీరింగ్), ఎం.ఎస్ (అప్లైడ్ ఫిజిక్స్) (ప్రస్తుతం “ఇంజనీరింగ్ ఫిజిక్స్” శాస్త్రంలో పి.హెచ్‌డి. పట్టా కోసం చదువుతున్నాను.)
ఆసక్తులు: సాహిత్యం (తెలుగు రచనలు చదవటం/చేయటం), వక్తృత్వం/శ్రోతృత్వం (చర్చలలో పాల్గొనటం), సంగీతం (ప్రపంచం నలుమూలల నుంచీ శాస్త్రీయ/లలిత సంగీతాలను ఆస్వాదించటం), చలనచిత్రాలు (చూడటం, చర్చించటం, “నేర్చుకోవటం”!), చిత్రలేఖనం (పెన్సిలు బొమ్మలు గీయటం, ఆధునికేతరచిత్రలేఖనాపోషణం), పరిశీలన (ఏదైనా సరే), సమాజానికి తోచిన విధంగా సాయపడటం

