వెంకటేశ్ మరణం – విషాదభరితం, ఆలోచనాస్పదం, స్ఫూర్తిజనితం

వెంకటేశ్ – అతవి జీవితం గురించి అతను మరణించే ముందు దాకా చాలా మందికి తెలియదు, నాతో సహా. తీరా తెలిసే సరికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మరణించిన వెంకటేశ్ ఆశయం వెనుక అతని మాతృమూర్తి ఆదర్శభరితమైన పెంపకముంది. ఆ తల్లి ఈనాటికీ పడుతున్న తపన వెనుక ఆ బిడ్డ చివరి కోరిక ఉంది.

నేడు మన మధ్యన లేని ఒక అసహాయ జీవి ఆవేదన, ఆశయ సాధన, మన దేశపు చట్టంలో ఒక బలీయమైన మార్పు కోసం అతని మరణానంతరం కూడా ఆ తల్లి పడే మథన సార్థకమవాలని, ఈ ఇద్దరి ఆలోచన వెనుక ఆంతర్యాన్ని మనలో కొందఱయినా అర్థం చేసుకుని, అవయవదానం చేయాలని, చేయించాలని ఆశిస్తున్నాను. నేను ఈ సారి భారతదేశం వెళ్ళినపుడు అవయవదానం గురించి వివరాలు సేకరించి, అవయవదానానికి నా ఆమోదం తెలియజేయాలని ఇప్పుడు సంకల్పిస్తున్నాను.

ఆ తల్లి ఉద్యమానికి ఎటువంటి చేయూతనైనా ఇవ్వడానికి సంసిధ్ధంగా ఉన్నాను. అటువంటి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయగలరు.

ప్రకటనలు

One response to “వెంకటేశ్ మరణం – విషాదభరితం, ఆలోచనాస్పదం, స్ఫూర్తిజనితం

  1. మెయిలు చేసినందుకు కృతజ్ఞతలు. నేను నా బ్లాగు నుండి మీకు ఒక లింకు ఇచ్చినాను. అవయవాలు దానం చెయ్యడం, మంచిదే చాలా మంది చేస్తున్నారు, ఇంకా చాలా మంది చెయ్యాలి. మా ఊరిలో ఒక పెద్దాయన చనిపోతే కొడుకు తండ్రిగారి కళ్ళు దానం చెయ్యాలి అని ఏర్పాట్లు చేస్తే, ఆ పెద్దాయన చెల్లెలు వచ్చి "బాగానే ఉంది మా అన్నయ్యని కైలాసంలో గుడ్డివాడిని చేస్తావా?" అంటే, పాపం ఆ సదరు కొడుకు గారు రిస్క్ ఎందుకు లే అని తన ప్రయత్నాన్ని మానుకున్నాడు. వెంకటేశ్ విషయంలో మెర్సీ కిల్లింగ్ కి కూడా ప్రయత్నించినట్లు నేను విన్నాను, నేను మాత్రం దానిని సపోర్ట్ చెయ్యడంలేదు. ఏమో ఎవరికి తెలుసు "మంచి మమ్దు కనుక్కొనవచ్చేమో"!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s