Monthly Archives: జనవరి 2005

హాసం – ఒక పత్రిక పతనం

హాసం – హాస్యము, సంగీతము ముఖ్యాంశాలుగా గత కొన్నేళ్ళుగా ఆంధ్రులను అలరించిన పత్రిక. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చదివేవాళ్ళు ఆ పక్షపత్రికని. వాళ్ళలో కొందరు చాలా కాలం క్రితమే పత్రికలు చదివే అలవాటు పోయిన వాళ్ళు. అయితేనేం, హాసం అందరినీ అలరించేది. అయినా అది ఈనాటి వాణజ్య ప్రపంచంలో నిలవలేక…పోయింది. అంత మంది చందాదారులున్నా, మరి కొందరయినా అప్పుడప్పుడూ కొనేవాళ్ళున్నా, కాగితం నాణ్యత మరీ గొప్పగా లేకపోయినా ఈ పత్రిక ఎందుకు ఆగిపోవలసివచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం లేదు, రాదు. తప్పు పాఠకులదా, సంపాదకులదా, పత్రికలదా, ప్రపంచానిదా ఎవరూ చెప్పలేరు.