క్రిస్టోఫర్ డేవిడ్ పెన్లీ – అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్ర పోలీసుల దౌష్ట్యానికి బలైన ఒక ప్రాణం. అమెరికా పోలీసులు అనగానే న్యాయంగానే అతన్ని చంపారనుకోవచ్చు. అతన్ని చంపింది ఎక్కడో తెలుసా? ఒక పాఠశాలలోని బాత్‌రూంలో. పిల్లలని చంపటానికి వచ్చిన ఉగ్రవాదిని పోలీసులు చంపారనుకుంటున్నారా? హతుడి వయసు ఎంతో తెలుసా? పదిహేనేళ్ళు! …మీ ఊహ నిజమే! ఆ అబ్బాయి ఆ పాఠశాల విద్యార్థి! ఎందుకు చంపారో తెలుసా?! బొమ్మ తుపాకీతో ఒక పోలీస్ అధికారిని బెదిరించినందుకు. అవును, బొమ్మ తుపాకీ! దానిని అసలైన తుపాకీగా భ్రమించిన పోలీసులు ఆ పిల్లవాడిని వెంటనే కాల్చి చంపారు! చంపిన వ్యక్తి పేరు? తెలియదు. వార్తలలో ఎక్కడా వ్రాయలేదు! కనీసం చనిపోయిన క్రిస్టోఫర్ బొమ్మ కూడా వెయ్యలేదు! పోలీస్ కాకపోయి ఉంటే అతనో కిరాతకుడైన హంతకుడు. మరి అతన్ని శిక్షించేదెవరు? మనుషుల్లో పైశాచికత్వాన్ని పారద్రోలేదెవరు?
(నాకు ఈ వార్త చెప్పినది నా తమ్ముడు శశాంక: <http://rahulsashanka.blogspot.com/>)