“నువ్వు వ్రాసిన ‘అమ్మ’ కవిత (Google) Buzz చెయ్యచ్చుగా?” అని అడిగిన ఒక మిత్రరత్నానికి నేను చెప్పిన సమాధానం “నేనిలాంటి ‘రోజు’లకి importance ఇవ్వను… సరేలే, అయినా ఆ కవిత Buzz చేస్తాలే” అని. ఆ పనే చెయ్యబోతే నేను అమ్మ గుఱించి గతంలో వ్రాసిన పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ కలిపి blog చేద్దామనుకున్నా. అంతలోనే అనిపించింది. “‘అమ్మ’ అన్న కవిత ఇప్పటికే పుస్తకంలో ప్రచురితమయింది, ఆ పాటేమో మఱొకరి బాణీకి వ్రాసినది. మఱి ఈరోజున ‘నాది’ అనుకోదగ్గట్టుగా మఱో క్రొత్త రచన చేద్దా”మనుకుని వ్రాసిన కవిత “అమ్మంటే…?” అన్నది. అమ్మంటే నాకు తెలిసేట్టు చేసిన మా అమ్మకూ, సమస్తచరాచరసృష్టికీ అమ్మే ఆధారమంటూ స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకు, రచయితలకు, అమ్మలా నన్ను ఆదరించిన అందఱికీ నెనఱులతో, జీవకోటిలోని ప్రతి అమ్మకీ నమస్కరిస్తూ… పైన పేర్కొన్న మూడు రచనలూ ఇక్కడ:
- http://tinyurl.com/nachaki-amma-7americatss – తాజాగా వ్రాసిన కవిత
- http://tinyurl.com/nachaki-amma-bhuvanavijayam – “భువనవిజయం” వారు సంకలం చేసిన “సాహితీకదంబం-1” (2005) పుస్తకంలో ప్రచురితమైన కవిత
- http://tinyurl.com/nachaki-amma-nanisong – (సినీ నటుడు రాజా ద్వారా పరిచయమైన) “నాని” అన్న యువకుడు కట్టిన బాణీకి వ్రాసిన పాట
http://urlm.in/enty/onDays.jpg – ఆగస్ట్ 13, 2003 నాడు ఈనాడు దినపత్రికలో ఈ “దినాల” పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయం (ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు!) (షరా: ఈ వ్యాఖ్యలో “సోదరిల” అనే సంకర మాట నాది కాదు – సంపాదకుల పుణ్యం. “సోదరులు” అంటే అన్నదమ్ములే కాదు, అక్కచెల్లెళ్ళు కూడా అనే సంగతి యెప్పటికి గ్రహిస్తారో!)
ఆ ట్యూన్ తో సహా పాట ఉంటే షేర్ చెయ్యగలవు!
కవిత విషయానికొస్తే as usual గా touch చేశావు!!
super like!!!
నాగార్జునా,
నచ్చినందుకు నెనర్లు!
బాణీ కట్టిన నాని ఆ పాటని ఆకాశవాణిలో (98.3 FM వాహిక?) చాలా సార్లు పాడాడట. కానీ, తన దగ్గఱ శ్రవ్యకం (audio clip) లేదని చెప్పినట్టు గుర్తు. మళ్ళీ అడుగుతాను, ఉంటే పంపుతాను.
I believe “sodaralu” means brothers(old & young) only. Sodareemanulu means sisters.
సోదరీమణులు అన్నది వాడుతున్నాము, కానీ మణులే కానక్కర్లేదుగా అందఱూ! 🙂 సోదరులు అన్నది సాధారణార్థంలోనూ, సోదరీమణులు అన్నది విశిష్టార్థంలోనూ వాడాలి.