మంచితనం, మానవత్వం, తెలివి, సంస్కారం – ఏమీ లేని నడుస్తున్న శవాల తెలంగాణాకి స్వాగతం పలికిన ముష్కరులారా… మీ పాపం పండింది! తమ ఒంట్లో చీము, నెత్తురూ ఉన్న తెలంగాణావాదులైనా, సమైక్యాంధ్రవాదులైనా సంస్కారం అన్న లక్షణం తమలో ఉందని నమ్మితే, తాము యింకా మనుషులమేనని నమ్మితే యిప్పటికైనా యీ పుండాకోరుల మీద తిఱగబడండి! ఇందుకా తెలంగాణా?! థూ…! నిన్న ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూసి వీరావేశం తప్పించి మఱేమీ మిగలక మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తెలిసిన ఎవఱైనా వాళ్ళకి తిలదానం చేసి కర్మకాండ జఱిపించాలి. ఇలాంటి చీడపురుగులు బ్రదికే సమాజం తెలంగాణా అయినా ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఇలాంటి హీనులను యెలాంటి కారాగారానికి పంపించినా ఆ కారాగారాలు కూడా అవమానంగా భావిస్తాయి.
“మఱి తెలంగాణాలో ఫలానా జఱిగినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావే”మని అడగబోయే ప్రతివాదులకు నా జవాబు:
నేను ఒక్కడిని నోరు మూసుకుంటే జఱిగే గొప్ప సంగతులేవీ ఆగిపోవు, మీ మీ బుద్ధికుశలత వాడి నేను నోరు మూసుకున్న సందర్భాల్లో మీరు నోరెత్తండి. నాకు చేతనయింది నేను చేస్తున్నాను… మనిషికి నష్టం కలిగించే యెలాంటి చర్యనైనా, ఎక్కడైనా నేను ఖండించి నాకు చేతనయింది చేస్తున్నాను. శాసనసభకు పంపిన ప్రజాసేవకులు తమ చర్యలకు అడ్డుండదన్న దురహంకారంతో అదే ప్రాంగణంలో కొట్టినప్పుడైనా నోరెత్తాను, తెలంగాణా సంస్కృతి తెలుసుకోకుండా యీసడించినవాళ్ళు అనుంగు స్నేహితులైనా నోరెత్తాను. మనిషిగా బ్రదికినప్పుడే అసలేమైనా చెయ్యగలం! నాలోనో మఱొకరిలోనో తప్పులు వెదుకుతూ కూర్చోవటమే మీకు చేతనైన పనయితే అదే చెయ్యండి. అది కాక యింకేమైనా చేతనైతే అదీ చెయ్యండి. శాంతిని సాధించలేని బ్రదుకు దండుగ! పురాణపురుషులు కూడా పాపం పండే దాకా ఆగారు, తప్పదు! ఆ పాపం ఫెటేలున పగిలిందిప్పుడే!
సమాజం మొత్తమూ గొడ్డువోలేదని, విద్యను గడించినవాళ్ళలో వినయం ఉంటుందని, వివేచన ఉంటుందని, మంచు చెడుల విచక్షణా ఉంటుందని, ఏది సమర్థనీయమో యేది కాదో తెలుసుకోగల కనీసజ్ఞానం యిప్పటి దాకా కనిపించపోయినా యిప్పుడైనా కళ్ళు తెఱిపిస్తుందని నా ఆశ. ఇవే మాటలు తెలంగాణా యాసతో వ్రాస్తే మఱింత మంది తమలో మనిషితనాన్ని గుర్తిస్తామనుకుంటే మొత్తమూ తెలంగాణా యాసలోనైనా వ్రాస్తాను. సంస్కృతి యేదైనా చిన్న చూపు ఉండకపోవటమే ముఖ్యం. “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కూడా “ఈ తెలంగాణా” గుఱించి ఆ మాట అని ఉండేవాడా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిన్న జఱిగిన ఘాతుకమెంత నీచమైనదో!
సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! మన లాంటి పీనుగులని పీక్కుతినటానికి తెలంగాణాకు చెందిన రాబందులు కూడా రావు!
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతి భ్రమ్శాత్ బుద్ధినాశా బుద్ధినాశా పణశ్యతి
(భగవద్గీత – ఇది తెలంగాణా కాదు, రాయలసీమ కాదు, కోస్తాంధ్ర కాదు… హర్యానాలో జఱిగింది.)
అమ్మా !!
నీ గారాల బిడ్డలము గదమ్మా !
మాయందు నీకు ఎల్లలు లేని ప్రేమ గదమ్మా !
నీ కృపా కటాక్షాల వల్లనే విద్వత్తు పొందాము !
నీ చరణ కమలాల సాక్షిగా నింగెత్తు ఎదిగాము !
మా ఆవేదనలు నీకు తెలియనివా అమ్మా ?!
మా ఆవేశకావేశాలు నీవు చూడనివా అమ్మా ?!
మా ఆక్రోశాలు నీవు విననివా అమ్మా ?!
నాడు శృంఖలాబద్ధవని మేము విలవిలలాడలేదూ ?!
వందే వందే వందే మాతరం అంటూ ఎలుగెత్తి పాడ లేదూ ?!
నీ బంగారు వడి లో ఎన్ని పోరాటాలు చేయ లేదూ ?!
నిన్ను మువ్వన్నెల చీర లో చూసుకొని మురుసుకో లేదూ ?!
ఆ సేతు హిమాచలము నీ ఛాయ గా తలచి ఉప్పొంగ లేదూ ?!
నీ పాధ ధూళి నొసట దాల్చి నిలువెల్లా పులకించి కీర్తించ లేదూ ?!
నీ అఖండ సౌభాగ్యమే మా భాగ్యమని మా సర్వస్వమూ అర్పించ లేదూ ?!
కానీ నేడు,
నీ పసిడి పంటల భక్ష్యాలతో మా ఆకలి తీరటం లేదు తల్లీ !
నీ విశాలవని లో ఏకమై ఇమడలేకున్నాము తల్లీ !
మా ఆశలూ అత్యాశలు గమనించావా తల్లీ ?!
మా రాబందు రాజ్యాలకు రాచ నగరులు కావాలి !
మాకు ఆ కలి పాశాల నులివెచ్చని కౌగిలులు కావాలి !
మాకు ఆ కలి క్రీడల ఉన్మత్త వేడుకలు కావాలి !
మా విద్వత్తు విశృంఖల విష ఘోష కావాలి !
మా మేధస్సు తో విధ్వంసక జాతరలు చేయాలి !!
మా కన్న బిడ్డలనే బలి తీసుకునే శూల ఖడ్గాలు కావాలి !
మమ్ము మేమే కడతేర్చుకునే విషవాడి కోరలు కావాలి !
మా బంగారు అమ్మవి కదూ, నీ బంగారమంతా పంచివ్వవూ ?!
నీ చీనాంబరం ను మేము చించుకొని పంచుకుంటాము !
నీ పాధ పద్మాలు రేకలు రేకలు గా విప్పి చల్లుకుంటాము !
నీ సౌభాగ్య చారికలను చీలికలు చేసుకుంటాము !
నీ అక్షయ సంపదలను మా విద్వేష నదుల్లో నిమజ్జనం చేసుకుంటాము !
నీ ఖండ ఖండాలను అమానుష ఉన్మాదానికి అర్పించుకుంటాము !
మమ్ము మన్నించు తల్లీ !!
మా ఇరుకు మనస్సులలో నిన్ను ఇముడ్చుకోలేము తల్లీ !!
నేటి ఖండ యాగం లో మా పౌరుషాగ్నికి నువ్వు బలి కావాలి తల్లీ !
నీ బిడ్డలమే అనీ ప్రాంత ప్రాంతాలలో తర తరాలు తలుచుకొని మెల్లగా మరపుకొంటాము తల్లీ !!
i Really support u r comments.
I don’t understand, how some leaders(?) planned this march, don’t they think how much public life gets effected when million people gathers in a city like Hyderabad, what happened yesterday on tankbund is shameful for all humans.
సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! — Very true, incidents like these truly make us question ‘are we all like the dead walking’?
పాపం పోతన బ్రతికిపోయాడు
ఎవరికీ తెలుసు భవిష్యత్తులో తెలంగాణా మహాభాగవతం ఎందుకు రాయలేదని
ఆయిన్ని కూడా యిలాగే సత్కరిస్తారు మూర్ఖులు
Nijamga siggupade pani jarigindi. Meeku veelu aithey JP video choodandi