నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మఱవద్దు…

పొద్దుటి వార్తలు చూసి మఱిగిన రక్తం చల్లబడిన తఱువాత నాకూ, మఱి కొందఱు స్నేహితులకు వచ్చిన ప్రశ్నలలో నుంచి పుట్టిన టపా యిది:

ఈ ఘోరానికి వ్యతిరేకంగా మనమేమీ చేయలేమా? మా మధ్య చర్చలోనూ, నా బుఱ్ఱలోను వచ్చిన ఆలోచనలివి:

 • ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.
 • మేథావులతో, గురువులతో, దార్శనికులతో, దిశానిర్దేశకులతో మాట్లాడి మార్గాన్ని నిర్ణయించుకోవాలి.
 • ఒక సన్మిత్రుని సూచన: చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.
 • చట్టపరమైన చర్యలు, పాలనాపరమైన చర్యలు సరైన దిశలోనూ, నిష్పక్షపాతంగానూ లేకపోతే మిన్నకుండే అర్హత లేదు ప్రజాస్వామ్యంలోని ప్రజలకి. గాంధీ ప్రబోధించిన “క్రియాశీలక అహింసామార్గం” మనకు మార్గదర్శనం చేయాలి. తిఱగబడని జనానిదే తప్పు! జనమంటే మనమే!
 • తెలంగాణా ప్రముఖులు అలక్ష్యానికి గుఱయ్యారన్న వాదులో నిజం లేకపోలేదు. (అక్కడ ఉన్న పదుల విగ్రహాలలో యెలా చూసినా ప్రముఖులు చాలా మందిని వదిలేసాము. వాళ్ళలో తెలంగాణా వాఱూ ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు.) ఈ అదనులోనే ఇన్నేళ్ళుగా విగ్రహాలు లేక మిగిలిపోయిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఊరూరా వాడవాడలా పెట్టిస్తే వాళ్ళ సాంస్కృతిక సేవలు, ఔన్నత్యం అందఱికీ తెలుస్తాయి. అవి తెలియని మౌఢ్యంలోనే జఱిగిన దాడులివి.
 • తప్పు మన అందఱిదీ. ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే. తెలంగాణా సంస్కృతినే కాదు, ఏ రకమైన సంస్కృతినైనా అర్థం చేసుకోలేక యీసడిస్తున్నవాఱెవఱైనా సరే, నేను వాళ్ళని దిద్దే ప్రయత్నమే చేసాను, ఇక ముందూ చేస్తాను. తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి.
 • సమస్య మన మధ్యలోనే ఉన్నా మౌనంగా ఉన్న మన తప్పును చూడకుండానే సమస్యని పరిష్కరించబూనటం కూడా మూర్ఖత్వమే. అది మనలో లేకుండా చూసుకుందాం.
 • తెలుగువాళ్ళంతా కలిసి ఉండటానికి మనం చేస్తున్నదేముంది? తెలంగాణా విడిపోరాదని తేల్చిచెప్పటం తప్పించి అక్కడి ప్రజలు మనలో ఒకటిగా, మనతో కలివిడిగా ఉండటానికి మనం చేస్తున్నదేముంది? సమైక్యత అంటే మనకు కావలసినట్టు ఉండటమూ కాదు, ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోవటం కాదు… ఆ ఐక్యభావన పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరమూ పాలు పంచుకోవాలి.

పైన పేర్కొన్న చర్యలలో కొన్ని నేను, ఒకరిద్దఱు మిత్రులు ఇప్పటికే మొదలుపెట్టాము. మఱి మీరు? (ఇంకా మనం చేయదగిన పనులేమైనా ఉంటే మీ వ్యాఖ్యలతో తెలియజేయండి.)

షరా: శీర్షికలోని గీతం డా. సి. నారాయణరెడ్డి గారు “కోడలు దిద్దిన కాపురం” చిత్రం కోసం వ్రాసినది. “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో…” అంటూ ఆయన “అమరశిల్పి జక్కన” చిత్రానికి వ్రాసిన గీతం “విగ్రహాలే కదా, మళ్ళీ కట్టుకోవచ్చు!” అన్నవాళ్ళకి సమాధానమిస్తుంది.

10 responses to “నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మఱవద్దు…

 1. First thing.. why separate state? Telangana nAyakulu vaalla praanthamu, prajalu venukabadi vunnarane bhAvana (nijam lekapoledhu).. so vAllaki separate state icchi nAyakathvam isthe vAllu thama praanthaanni abhivruddhi chesukuntaaru.. thats fine.. but so called Congress party ki (I should say madam gaariki)buddhi ledha or burra ledha? KCR chestunna vAgdhanaalalo kaneesam for the time being 20% aina chesi chupisthe prajalalo antha agitation vundadhu. That way separate state avasaram ledhu.. Why the hell are the so called politicians are playing with the common people. Sodharulara, meeru Hussain sagar lo padeyyalasindhi mana mahathmula vigrahaalu kaadhu, dheeni anthataki kaaranamaina Politicians ni.. anni vigrahaalu padese badhulu okka politician ni padeyyandi, chaalu samasyalanni theeripothaayi.. I promise..

 2. “ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.”

  ఖచ్చితంగానండీ… ఇటు కోస్తావాసులనుండీ వచ్చే సమాధానం ఇలా విధ్వంసకరంగా, హింసాయుతంగా వుండకుండానైనా జాగ్రత్త పడాలి.

  “చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.”

  దీన్ని నేనంగీకరించబోను. జరిగిన దౌష్ట్యానికి ప్రతీకగా ఆ విగ్రహశిధిలాలనలాగే వుంచాలి. అవి జరిగిన అవమానకరమైన,అనాగరికమైన కార్యానికి గుర్తుగా మన మనఃఫలకాలపై నిలిచిపోవాలి.ఆ మహానుభావులను అవమానించడం ఎవరివల్లకూడా కాదు. ఇలా అయితే అసలేమాత్రమూ కాదు

 3. “చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.”

  దీన్ని నేనంగీకరించబోను. జరిగిన దౌష్ట్యానికి ప్రతీకగా ఆ విగ్రహశిధిలాలనలాగే వుంచాలి. అవి జరిగిన అవమానకరమైన,అనాగరికమైన కార్యానికి గుర్తుగా మన మనఃఫలకాలపై నిలిచిపోవాలి.ఆ మహానుభావులను అవమానించడం ఎవరివల్లకూడా కాదు. ఇలా అయితే అసలేమాత్రమూ కాదు

  NacHaki anattu, ninna aa praatam lo unna valalo entha mandiki akkadunna pramukhula gurinchi telusu?Sir Arthur Cotton – Britisher aina kooda telugu vaari meeda mamakaram tho dHavaLEswaram bridge kattinchadame eeyana chesina maHaa Paapam!

  sWargEEya mukHyamantri Nandamuri TarakaRamarao garu anattu, gatanni gurtu chestu, vartamaananiki prerananistu, bhavishyattuki mangala harati patte kamanEEya kalapRaanganam ika manaku lenanduku chintinchali

 4. Very Sensible Post

  “తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి”

  Bingo..The attitude of some Andhrites is adding insult to injury and thereby increasing the complexity of the issue.

  చందాలేసుకొని విగ్రహాలని పునరిద్దంచడం గురించి..

  నేను రెడీ..

 5. I agree with Pavan Kumar.
  Those statutes and pedals should be left as it is
  as witness to ‘”Mad March of March10″

 6. Well, I could not write in telugu… and also I am not a regular blogger… but I have some view point on what is going here (in the blog). I really do not know whether people accept this. I heard a story a while ago, which goes as follows. A guy is quiet rich and has some diamonds with him, which he buries underground so that no one can steal it from him. Everyday, he digs the box out, counts the diamonds and buries at the same place. One day another man happens to observe this and after this rich man buried the box, he digs out and replaces the diamonds with stones and steals the diamonds away. The rich guy returns the other day and breaks to tears as he finds only stones. A wise man happens to pass by, stops at cries, knows the matter from him and questions him “What were you doing with those diamonds?”. The rich man says, I was counting them… The wise man says, “What is the difference? Now count the stones… ”

  I think people got what I wanted to say. For those people, who are a bit slow (like me).. let me take some pains to explain… What do we know about those people, whose statues are broken? Nothing matters… We were polluting the atmosphere.. we don’t even care about the maximum speed on the tank bund, we don’t even read about them… we are also losing (loosing … ha ha 🙂 ) their writings, we dont care…. now suddenly we care, because someone broke those statues… common… grow up… dont you think we should be worried something else other than statues?

  OK … let me put another point …. For example… Who is Akbar? What is his father’s name? What is his son’s name? When did he become King? When did he die? Whom did he marry? How many movies came with him as a character (telugu, hindi english etc)? Which class and which subject and which chapter did you study about Akbar? Actually, What (good) did Akbar do to our country (other than ruling for some time and expanding his kingdom)? (Perhaps last question is a bit tough to answer for a lot of people, unless they have read Akbar as their subject)… Now take any statue guy…. for example… Siddhendra yogi… try to answer all the above questions with respect to Siddhendra Yogi… How many questions could you answer?

  What good is a statue? Don’t you think we have made very conscious attempts towards forgetting, ruining, not caring about our own things (culture is only one aspect)… I felt bad when they broke the statues… I also felt bad when I started thinking about myself like explained above… I dont think we deserve those great people’s statue stand when you are going on tank bund polluting, without caring speed limits etc… Make a statue in your minds, hearts and that no one can break it away… steal it away… I am a pro-telangana guy.. i mean I want telangana to develop as a self-sustaining area and it doesn’t matter if it is as a separate state or a region inside a state… well… I am not born here… I am not educated here… I dont understand the culture here… but I dont like when someone says that I dont “belong” to this place… Are you still reading to see if I will advocate a unified state or a separate state? well.. you have already separated telangana… congratulations… for me India is ONE… World is ONE… What happened in Japan really moves me than some idiots breaking some statues and other people crying foul on them instead of looking at the grass roots of the problem…

  Let me give another example and close this… “Do you believe in astrology? because it does not seem to be scientific? I will start something in a
  ‘durmuhurtam’ and see if I will fail” someone was saying… It is as good as a very old man saying.. “I dont understand computer.. it is not at all useful… will it give me food if I type food?”… Well… both guys need education.. the point is we are not looking forward to get educated in our own Indian ways, but we are very good in questioning ourselves by saying “do u believe in vedas? do u believe in ramayana?”. Unfortunately, the one questioning and the one answering both did not study vedas and both id not study ramayana. Our western form of education has given us so much “MINDSET”, “ATTITUDE”, “KNOWLEDGE”, “WISDOM” to say … “i dont think Rama existed… prove it…”… and still we think that is a better form of education…. “saMskRutaM nErchukuMTE Emostundi bAsoo?” aMTE… “enta Dabbostundee” ani… I think we dont deserve to have a look at such iconic figures who stand tall in those statues… If you think it is those statues that have fallen… please read my post once again… You will know that you have fallen… rise, awake, May GOD bless you with knowledge… Rangamannar

 7. @Ranga, You can use the same argument for pretty much any structure – charminar, Taj Mahal, the pyramids (oh and Babri Masjid).. The point is not what I know about one specific Siddhendra Yogi today – I did try to find answers to those questions when I first saw them on the Tank bund. Future generations may not even know of the existence of such people if we don’t preserve them in some kind of a physical, iconic form. Comparing Japan’s situation and this is a false dichotomy – one can feel sad about multiple events.

  More than the physical destruction of the statues themselves, what bothers me is the hatred with which the whole thing was planned, and utter disregard for one’s own culture. As it is, the importance of Telugu is waning (yes, I notice the irony, thank you very much), and now these idiots want to malign entire Telugu history and culture by attributing pseudo-regionalistic politics to historic figures. If given a separate state, these guys would probably sell off Salarjung Museum’s collection. While I agree that the physical loss is not much in itself, it does put a scary picture of the future in mind.

  Finally, culture or heritage is not about belief or faith. It does not matter if Rama lived or not – one can still enjoy the literary heritage we have.

 8. రంగమన్నార్ గారి వ్యాఖ్యలో అంతర్గతంగా నాకు కనిపించిన ఒక పాయింటు:
  “మనం మన గురించి మరిచిపోతున్నాం. విగ్రహాలు ఏ వ్యక్తుల రూపాలో వారి గురించే మరిచిపోతున్నాం. దాని గురించి ఎక్కువ బాధపడాలి, విగ్రహాలు పగలగొట్టినందుకు కాదు”

  దీన్ని నేను అంగీకరిస్తాను. కాని, అంత మాత్రం చేత విగ్రహాలు పగలగొట్టడాన్ని గూర్చి చింతించాల్సిన అవసరం లేదనడం నేను ఒప్పుకోను. దానికి మిర్చిబజ్జిగారిచ్చిన సమాధానమే నాదీను. మరొక్క విషయం. ఈ విగ్రహాలని వట్టి రాళ్ళగా చూసేవాళ్ళకి వాటిని పగలగొట్టడం వల్ల పెద్ద బాధ కలగకపోవచ్చు. కాని ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి: ఒకటి, ఆ పగలగొట్టిన వాళ్ళు అవి వట్టి రాళ్ళే అనుకుంటే అవి పగలగొట్టే వారే కాదు. అంచేత పగలగొట్ట బడింది వట్టి రాళ్ళు అని అనుకోడానికి ఆస్కారమే లేదు. రెండు, ఏ కారణం చేతనయినా కొందరికి వాటిని పగల గొట్టడం వల్ల పెద్దగా బాధ కలగకపోవచ్చు. అందులో తప్పుబట్టే విషయమేం లేదు. కాని బాధ కలిగి, దాన్ని వ్యక్తం చేసిన వాళ్ళదగ్గరకి వచ్చి దీని గురించి బాధపడడం అనవసరం అని చెప్పే హక్కు, అవసరం వాళ్ళకి లేదు.

  “ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే.”

  ఈ విషయంతో నేను ఏకీభవించను, నా వరకూ. విద్యార్థుల ఆత్మహత్యలకి బాధ ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు ఒక న్యాయమైన/మంచి కారణనానికి తమ ప్రాణాలని త్యాగం చేసారని నేను నమ్మినప్పుడు. అలాంటి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? ప్రత్యేక తెలంగాణా ఉద్యమం న్యాయమైనది అని నేను నమ్మినప్పుడు. నేను ప్రత్యేక తెలంగాణావాదినీ కాదు, సమైక్యాంధ్రవాదినీ కాదు. మరి నేను వాళ్ళు చేసిన ప్రాణత్యాగం నిజంగా విలువైనదే అని ఎలా నిర్ణయిస్తాను? అలా చెయ్యనప్పుడు దానికి ఎలా స్పందిస్తాను?
  విగ్రహాల విషయం అలా కాదు. ఆ విగ్రహాలు నా సంస్కృతికి చిహ్నాలు. అవి వట్టి రాళ్ళు కావు. చరిత్రలోని మైలురాళ్ళు. పైగా ఆ పగలగొట్టడం వెనక ఉన్నది మన జాతిని రెండుగా చీలుస్తున్న ఒక విద్వేషం. అంచేత వాటిని పగలగొట్టడం నాకు బాధని కలిగిస్తుంది, దానికి నేను స్పందించాను. కాబట్టి, దీనికి స్పందించి దానికి స్పందించ లేదేం అని అడగడంలో అర్థం లేదు.

 9. I totally agree with Ranga, and I least bother about the statues. Hundreds of times I drove on Tankbund road, walked around but you know, I never know evarevari statues vunnayo, enni vunnayo, elaa vunnayo? and I bet 90% of the people are like me only.. Just because some fools demolished them we are talking about.. How many of our beloved politicians know the history of these great people, I would say < 20%. So nothing much to bother..

  "Vigrahaalaki Paalatho Abhishekam chese badhulu pakkanunna bicha gaadiki paavala isthe nenu chala santhoshisthaanu"..

  Our politicians are very clever in these aspects.. they know what people are much bothered and for what not.. that is why there is corruption, acculation of lacks of crores of amount in Swiss banks.. People should fight against these.. nenu alaa cheyyalekapothunnandhuku siggu paduthunna, chavata laga just matladutunnandhuku baadha padutunna.. but I am sure some point in my life I would fight against corruption and hope ee blog chadhuvutunna kaneesame padhi mandhi aina initial supporters avuthaarani..

  Finally, I HATE OUR POLITICIANS and sorry for those good politicians (if there are any). I am not a Gandhi follower instead I love Bhagath Singh. Can anyone count how many Bhagath singh statues do we have? Hardly, right?

  We have Gandhi statues, because many of us think that he is the ancestor of Sonia (Gandhi).. Hmm.. but Bhagat singh.. nope.. adhi mana paristithi..

 10. My opinion on the main content and comments as follows.

  I totally agree with the author, the statues need to be built again, may not be with donations from public, better way would be to collect the money from the sponsors of this demolition, not just in this case, if any political party or group burns buses or destroy public/private property same method should be followed.

  Some people opinion is why should we bother about statues, these are the people who has done enormous amount of work in language and other aspects, we need to remember them just like we remember our ancestors in our family (we are not doing that, sadly) and last thing is there should be statues of Bhagat singh, Netaji and other freedom fighters not just Gandhis ( we don’t need statues of Indira or Rajiv).
  Main thing which hurts lot of people from this demolition is the hatredness in some people mind. This whole episode raises doubts in non-telangana people, if state is divided, does botherhood will be there, or just hatredness.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s