పుట్టు పేరు: చక్రవర్తుల కిరణ్
పెట్టు పేరు (కలం పేరు): నచకి (“నల్లాన్ చక్రవర్తుల కిరణ్”)
స్వస్థలం: హైదరాబాదు*, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం (* – పెఱిగినది రాయలసీమలోనైనా బహుకాలనివాసం రాజధానిలోనే)
విద్యార్హతలు: బి.టెక్. (ఎలెక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్), ఎం.ఎస్. (బయోమెడికల్ ఇంజనీరింగ్), ఎం.ఎస్. (మైక్రోసిస్టమ్స్ ఇంజనీరింగ్), ఎం.ఎస్ (అప్లైడ్ ఫిజిక్స్), పి.హెచ్‌డి.(ఇంజనీరింగ్ ఫిజిక్స్), పి.జి. డిప్లొమా (ఇన్నొవేషన్ అండ్ డిజైన్ థింకింగ్)
వృత్తి: ఇంజినీరింగ్ విద్యార్థులకు అధ్యాపకత్వం; చలనచిత్ర గీతరచన
ఆసక్తులు: సాహిత్యం (తెలుగు రచనలు చదవటం/చేయటం), వక్తృత్వం/శ్రోతృత్వం (చర్చలలో పాల్గొనటం), సంగీతం (ప్రపంచం నలుమూలల నుంచీ శాస్త్రీయ/లలిత సంగీతాలను ఆస్వాదించటం), చలనచిత్రాలు (చూడటం, చర్చించటం, సమీక్షించటం, “నేర్చుకోవటం”!), చిత్రలేఖనం (పెన్సిలు బొమ్మలు గీయటం, ఆధునికేతరచిత్రలేఖనాపోషణం), పరిశీలన (ఏదైనా సరే), సమాజానికి తోచిన విధంగా సాయపడటం
సాహితీసేద్య ఫలాలు: అంతర్జాల పత్రికలు, అమెరికాలోని కొన్ని తెలుగు పత్రికల్లో ప్రచురింబడిన కవితలు, పద్యాలు, కథలు, పాటలు; “చక్రవర్తుల” అన్న తెఱపేరుతో వెలువడిన కొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు, చలనచిత్రేతర గీతాలు; సరస్వతీపుత్రులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్, శ్రీ మేడసాని మోహన్ వంటి దిగ్గజ అవధానుల గోష్ఠిలో పృచ్ఛకునిగా న్యస్తాక్షరి నిర్వహణ, పొద్దు వారి అంతర్జాల అవధానాల్లో పాల్గోత
కిరణ్ గారూ! నేను హైదరాబాదు వాసినే. నవంబరు 3వ వారంలో తిరిగి వస్తాను. మనం కలవవచ్చా? వేటూరి గారి గురించి అద్భుతంగా చెప్పారు. ప్రస్తుతం నేను మెయిలు (gksraja@gmail.com) లోనే అందుబాటు. హైదరాబాదులో నా ఫోను నెంబరు 9989126636. మీ కాంటాక్టు వివరాలు ఇవ్వగలరా? నమస్కారం.
gksraja.blogspot.com